Rashi Phalalu: నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వారికీ ఎలా ఉందంటే?

by Prasanna |   ( Updated:2023-04-17 01:59:57.0  )
Rashi Phalalu Today
X

1. మేష రాశి

మీ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపండి. మీ ప్రేమ జీవితంలో కష్టాలు రావొచ్చు. అయిన మీరు ఈ రోజు ప్రతి సమస్యను దైర్యంగా ఎదుర్కొంటారు. మీరు ఈ రోజు ఎంత బిజీగా ఉన్నా.. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

2. వృషభ రాశి

మీ వ్యక్తిగత సమస్యలు వలన మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు ఎంత గానో ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బయటకు తీసుకెళ్లి నచ్చినవి కొని పెడతారు.

3. మిథున రాశి

ఈ రోజు దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఎవరో తెలియనివారి సలహాల వలన పెట్టుబడిపెట్టినవారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి పనుల వల్ల మీకు బాగా కోపం వస్తుంది. దాని వల్ల ఈ రోజు చేయాలిసిన పనులు వాయిదా పడతాయి.

4. కర్కాటక రాశి

మీ స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. ఈ రోజు మీ ఆరోగ్యం వల్ల మీ మూడ్ మొత్తం చెడి పోతుంది. ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టిన విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు మీరు, మీ పిల్లలతో గడపడానికి మీకు ఎక్కువ సమయం దొరుకుతుంది.

5. సింహ రాశి

మీ గురించి ఎవరు ఏం అనుకున్నా మీరు అవేమీ పట్టించుకోకుండా మీ పని మీరు సక్రమంగా పూర్తి చేస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీకు అద్భుతమైన రోజుగా మీ జీవితంలో మిగిలిపోతుంది.

6. కన్యా రాశి

మీరింతవరకు వెళ్ళని ప్రదేశానికి కబురు అందితే అంగీకరించండి. మీ ప్రేమ జీవితం అందంగా మారబోతుంది. అందరికీ దూరంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తుల రాశి

మానసికంగా బలంగా ఉండటానికి యోగా చేయండి. మీరు అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టకండి. డబ్బు కష్టపడితేనే మీకు వస్తుందన్న విషయం మర్చిపోకండి .ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో షేర్ చేసుకునే విషయాలు మర్చిపోవడం వల్ల అతను మీతో గొడవ పడే అవకాశం ఉంది.

8. వృశ్చిక రాశి

ఖర్చులు బాగా పెరిగిపోతాయి. కాబట్టి డబ్బును ఖర్చు పెట్టకండి. మానసికంగా బలంగా ఉండటానికి యోగా చేయండి. మీ యొక్క వస్తువులు దొంగతనానికి గురి అవుతాయి. మీ వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోండి . మీరు కుటుంబంతో మీ సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబంలో చిన్నవారిని దగ్గరకు తీసుకోండి. మీ శ్రీమతితో ఈ రోజు జాగ్రత్తగా ఉండండి.

9. ధనస్సు రాశి

వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగండి. కొన్ని కారణములవలన మీరు పని చేసే ఆఫీసులో మీకు ఎదురుదెబ్బలు తగులుతాయి. మీ జీవిత భాగస్వామి మీద లేని పోనీ అనుమానాలు పెట్టుకోకండి.. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం.

10. మకర రాశి

ఇంటి వద్ద పని చేసేటప్పుడు , ప్రత్యేక శ్రద్ధ పెట్టండి .మీరు ఈ రోజు కొత్త వ్యాపారవేత్తలను కలుకుంటారు . మీ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించండి . ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు . అది కూడా మీ మంచికె అని ఆలస్యంగా గుర్తిస్తారు.

11. కుంభ రాశి

ఈ రోజు మీ ప్రవర్తన వలన మీ ప్రియమైన వారు విసిగిపోతారు.మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజుమొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండకపోతే మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది.

12. మీన రాశి

ఇంటికి దూరంగా ఉంటున్నవారు , వారి ఖాళి సమయాన్ని పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కాని సమయాన్ని గడుపుతారు.మీరు ఈ రోజు దుఃఖానికి గురి అవుతారు . రాత్రి సమయంలో మీతో మీరు సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది .


ఇవి కూడా చదవండి:

Telugu Panchangam 17 ఏప్రిల్ : నేడు శుభ, అశుభ సమయాలివే !

Advertisement

Next Story