- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంగళ యోగం.. ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్..
దిశ, ఫీచర్స్: జోతిష్యశాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. కుజుడు రెండవ రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బృహస్పతి ప్రస్తుతం ఈ రాశిలో ఉన్నాడు. 12 ఏళ్ల తర్వాత ఈ గ్రహాల కలవనున్నాయి. ఒకే రాశిలో బృహస్పతి, కుజుడు ఉండటం వల్ల చాలా శక్తివంతమైన మంగళ యోగంఏర్పడుతోంది. ఈ యోగం వల్ల రెండు రాశుల వారికి ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వృత్తి, విద్య మరియు వైద్య రంగాలలో పని చేసే వారికి కూడా శుభవార్త ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మేష రాశి
బృహస్పతి, కుజుడు కలయిక వల్ల మేష రాశికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఈ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆగిపోయిన మీ డబ్బు మీ దగ్గరికి వస్తుంది. కొత్తగా చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. ముఖ్యంగా, జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కన్య రాశి
కన్యారాశి వారికి ఆదాయ లోటు ఉండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. పెట్టుబడిదారులు అద్భుతమైన రాబడిని పొందుతారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కన్యారాశి వారికీ అద్భుతంగా ఉండనుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు