- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాళవ్య రాజయోగం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు
దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతుంటాయి. ముఖ్యంగా, సంచార గ్రహాలు ఒక వ్యక్తి యొక్క జాతకంలో శుభ స్థానంలో ఉంటే.. అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి జ్యోతిష్య శాస్త్రంలో, కొన్ని గ్రహాల సంచారం వల్ల యోగాలు ఏర్పడతాయి. ఇది కొన్ని రాశుల వారికి వ్యాపార జీవితంలో మార్పులకు దారితీస్తుంది. అయితే, ఈ గ్రహం జూన్ 29వ తేదీ వరకు మిథున రాశి లోనే ఉండబోతోంది. ఈ రాశిలో బుధుడు, ఇతర గ్రహాల కలయిక వలన మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మేషం రాశి
మాళవ్య రాజయుగం ఏర్పడటంతో మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ యోగ ప్రభావంతో ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. ఇది మీ ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పెంచుతుంది. అంతే కాకుండా, మీ ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగం వస్తుంది.
సింహ రాశి
మాళవ్య రాజయుగం వల్ల సింహా రాశి వారికి శత్రు బాధ తొలగిపోతుంది. ముఖ్యంగా, ఈ రాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో వాహనం కొనుగోలు చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు. అలాగే, సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా పేరు ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. మీరు, మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.