ఎక్సైజ్‌శాఖ‌కు కిక్కే కిక్కు.. మద్యం టెండర్లలో పోటెత్తిన‌ ఆశావహులు

by Shyam |   ( Updated:2021-11-19 09:01:53.0  )
alcohol tenders
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ఊహించిన‌ట్లుగానే మ‌ద్యంషాపుల‌కు ఆశావ‌హుల నుంచి ద‌ర‌ఖాస్తుల ప్రవాహం కొన‌సాగింది. ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించిన నాన్ రిఫండ‌బుల్ న‌గ‌దును రూ.2 ల‌క్షల‌కు పెంచినా ఆశ‌వ‌హులు మాత్రం వెన‌క్కి త‌గ్గలేదు. వ‌రంగ‌ల్ డివిజ‌న్‌లోని ఆరు జిల్లాల ప‌రిధిలో 294 వైన్‌షాపుల‌కు టెండ‌ర్లు నిర్వహించారు. ఇందులో ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగ‌పేట వైన్‌షాపుల‌పై హైకోర్టులో స్టే ఉండ‌టంతో మిగ‌తా 292 వైన్ షాపుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించారు. మునుపెన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో 9765 ద‌ర‌ఖాస్తులు రావ‌డం గ‌మ‌నార్హం.

జిల్లాల వారీగా చూసిన‌ట్లయితే హ‌న్మకొండలో 2983, వరంగల్‌లో 1793, జనగామలో 1512, మహబుబాబాద్‌లో 1572, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో 1905 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు ఎక్సైజ్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ సురేష్ రాథోడ్ తెలిపారు. ద‌ర‌ఖాస్తుల రూపంలో రూ.195 కోట్ల 30 లక్షల ఆదాయం స‌మ‌కూరింద‌ని తెలిపారు. అత్యధిక దరఖాస్తులు హ‌న్మకొండ జిల్లా నుంచి వ‌చ్చినట్లు సురేష్ రాథోడ్ తెలిపారు. ఇదిలా ఉండ‌గా ల‌క్కీడ్రా ద్వారా క‌లెక్టర్ల స‌మ‌క్షంలో ల‌బ్ధిదారుల‌ను శ‌నివారం ఎంపిక చేయ‌నున్నారు. ఈమేర‌కు ఆయా జిల్లాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశారు. హ‌న్మకొండ జిల్లాకు సంబంధించి అంబేద్కర్ భ‌వ‌న్‌లో ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story