- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోండా కీలక నిర్ణయం.. ప్లాంట్ మూసివేత!
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు గ్రేటర్ నోయిడాలో ఉన్న ప్లాంట్‌ను నిలిపి వేస్తున్నట్టు బుధవారం తెలిపింది. స్థానిక మార్కెట్లో సుధీర్ఘ మందగమనం మధ్య అమ్మకాలు ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాలను పెంచి కార్యకలాపాలను కాపాడుకోవాలని భావిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. దేశీయంగా ఉన్న రెండు ప్లాంట్‌లలో నోయిడా ప్లాంట్‌ను నిలిపేస్తున్నట్టు స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న సివిక్, సీఆర్-వీ మోడల్ కార్లు భవిష్యత్తులో ఉండవని, వీటి ఉత్పత్తికి అధిక పెట్టుబడులు అవసరం ఉన్న కారణంగా వీటిని ఆపేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. దేశీయంగా మంచి ఆదరణ ఉన్న సివిక్, సీఆర్-వీ మోడళ్లను ఆపేయడం బాధాకరంగా ఉందని, రానున్న 15 ఏళ్ల వరకు ఈ రెండు మోడళ్ల వాహన యజమానులకు అన్ని రకాలుగా కంపెనీ నుంచి సహాయం ఉంటుందని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ చెప్పారు. నోయిడాలో ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న హోండా సిటీ వంటి వాహనాలు ఇకపై రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతాయని తెలిపారు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో హోండా కార్లలో కాంపాక్ట్ సెడాన్ అమేజ్, మిడ్-రేంజ్ సెడాన్ హోండా సిటీ, సబ్-4 ఎం ఎస్‌యూవీ, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ మోడళ్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.