డిప్యూటేషన్‌లోకి ముగ్గురు బెంగాల్ ఐపీఎస్‌ ఆఫీసర్లు

by Shamantha N |
డిప్యూటేషన్‌లోకి ముగ్గురు బెంగాల్ ఐపీఎస్‌ ఆఫీసర్లు
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ క్యాడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇక నుంచి సెంట్రల్ డిప్యూటేషన్‌ కింద సేవలందించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఆ ముగ్గురు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు భద్రత కల్పించే బాధ్యతలు తీసుకుంటారు. బెంగాల్ పర్యటనలో జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఈ ఆదేశాలు వెలువరించింది.

నడ్డా కాన్వాయ్‌పై దాడిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ గవర్నర్, ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. కానీ, లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, కాబట్టి ఘటనపై తాము దర్యాప్తు జరుపుతామని మమతా సర్కార్ సమాధానమిచ్చింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతోనే ఇండియా సర్వీస్ ఆఫీసర్‌లను సెంట్రల్ డిప్యూటేషన్‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed