కరోనా పేషెంట్లకు కరెంట్ కష్టాలు

by Shyam |
కరోనా పేషెంట్లకు కరెంట్ కష్టాలు
X

దిశ, చిట్యాల: కరోనా వ్యాధితో ఓ వైపు రోగులు బాధపడుతుంటే మరోవైపు కరెంటు సమస్య తీవ్రంగా వేధిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల వ్యాప్తంగా గత ఐదు రోజుల నుంచి విపరీతమైన కరెంటు సమస్య నెలకొంది. ఇటీవల కురిసిన వడగండ్ల వాన కారణంగా కరెంట్ స్తంభాల విరిగి నేలమట్టమయ్యాయి. దీంతో విద్యుత్ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్ల సహాయంతో మరమ్మత్తులు చేపట్టారు. అయినా నేటికి పనులు పూర్తి కాకపోవడంతో తరచు కరెంటు వస్తూ పోతోంది. దీంతో క్వారంటైన్‌లో ఉన్న కొవిడ్ బాధితులకు తిప్పలు తప్పడం లేదు. అసలే కరోన వ్యాధితో బాదపడుతున్నాం.. మరోవైపు వేసవి కాలం.. ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొవిడ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటికి వద్దమంటే వైరస్ మరెవరికైనా అంటుకుటుందని భయం.. నిబంధనలతో సతమతమవుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి యుద్ధప్రతిపాదికన విద్యుత్ మరమ్మతులు చేపట్టాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story