- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2021-22లో 40 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యం: ఉషా ఇంటర్నేషనల్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గృహోపకరణాల దిగ్గజ సంస్థ ఉషా ఇంటర్నేషనల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 40 శాతం రిటైల్ అమ్మకాల వృద్ధిని సాధించాలని లక్ష్యంగా ఉన్నట్టు వెల్లడించింది. కరోనాను నియంత్రిస్తూ టీకా ప్రక్రియ వేగవంతం కావడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోందని కంపెనీ రిటైల్ విభాగం అధ్యక్షుడు కపిల్ కొహ్లీ చెప్పారు. మహమ్మారి పరిణామాల నేపథ్యంలో ఈ-కామర్స్ విభాగం భారీగా పుంజుకోవడంతో ఈ ఏడాది మొత్తం ఆన్‌లైన్ అమ్మకాల వాటా రెండంకెల స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.
‘మొత్తంగా 2021-22లో 40 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం. మే, జూన్ నెలల్లో అమ్మకాల రికవరీ ధోరణిని అంచనా వేసి సగటున 38-45 శాతం మధ్య వృద్ధి ఉంటుందని’ కపిల్ వివరించారు. గతేడాది కంపెనీ మొత్తం అమ్మకాలు సింగిల్ డిజిట్‌లో పెరిగాయి. భౌతిక దుకాణాలు మూడు నెలల పాటు మూసేయడమే దీనికి కారణం. లాక్‌డౌన్ వల్ల ఫ్యాన్లు, కూలర్ల వంటి అమ్మకాలపై ప్రభావం అధికంగా నమోదైందన్నారు.