- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పెషల్ ఎడిషన్ 'గ్రాజియా 125' స్కూటర్‌ను విడుదల చేసిన హోండా!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) సోమవారం తన 125సీసీ స్కూటర్ గ్రాజియా స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రూ.87,138(ఎక్స్‌షోరూమ్) ధరతో ఈ స్కూటర్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. స్పెషల్ ఎడిషన్‌గా తెచ్చిన ఈ స్కూటర్ డిజైన్‌ను హోండా రెప్సోల్ రేసింగ్ టీమ్ డిజైన్ థీమ్, గ్రాఫిక్స్, ఇతర అంశాల ప్రేరణతో తయారు చేసినట్టు కంపెనీ వెల్లడించింది.
‘దేశీయ రేసింగ్ అనుభూతిని కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ మోడల్ స్కూటర్‌ను తీసుకొచ్చామని’ హెచ్ఎంఎస్ఐ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అట్సుషి ఒగాటా అన్నారు. ప్రత్యేకంగా తెచ్చిన ఈ గ్రాజియా స్కూటర్ ప్రోగ్రామ్‌డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంజిన్‌తో మెరుగైన స్మార్ట్ పవర్, ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ లాంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా మల్టీ-ఫంక్షన్ స్విచ్, ఇంజిన్-కట్ ఆఫ్‌తో సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తో వస్తుందని కంపెనీ వివరించింది. ‘స్పోర్టీ లుక్‌తో వస్తున్న గ్రాజియా 125.. ఆరెంజ్, రెడ్, వైట్ గ్రాఫిక్ కలర్‌తో మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకుంటుందని’ హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ అన్నారు.