ఢిల్లీ హింసపై హోం శాఖ డబుల్ స్టాండ్!

by Shamantha N |
ఢిల్లీ హింసపై హోం శాఖ డబుల్ స్టాండ్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరస్పరం భిన్న వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా కావాలనే.. పథకం ప్రకారమే ఢిల్లీలో హింసకు పాల్పడుతున్నారని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం అన్నారు. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారంనాటి ఉన్నత స్థాయి రాజకీయ ప్రతినిధుల భేటీలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు విరుద్ధంగా కామెంట్ చేశారు. ఢిల్లీ హింసాత్మక ఘర్షణలు ఆకస్మికంగా జరిగినవేనని చెప్పుకొచ్చారు. కాగా, ఢిల్లీ అల్లర్లు పథకం ప్రకారం జరిగినవేనని కాంగ్రెస్ ఆరోపించింది.

Advertisement

Next Story