- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్షన్.. టెన్షన్.. మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
దిశ, వెబ్‌డెస్క్ : మంత్రి చామకూర మల్లారెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి బోయినిపల్లిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి ఇంటిని కాంగ్రెస్ నాయకులు ముట్టడించే ప్రయత్నం చేశారు. దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే.. ఈ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో దళిత కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మల్లారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంత్రి మల్లారెడ్డి ఇంటివద్ద టెన్షన్ టెన్షన్..!!
చుట్టుముట్టిన కాంగ్రెస్ శ్రేణులు…!! pic.twitter.com/SQy3Dlbocq
— Pulse of Telangana #StaySafe (@PulseTelangana) August 25, 2021
ఇవి కూడా చదవండి: