- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిగ్ బ్రేకింగ్.. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు సంచలన ఆదేశాలు

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవిడ్ వ్యాప్తిపై గురువారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని సర్కార్‌ను ఆదేశించింది. ఎయిర్‌పోర్టులో ఉన్నట్టుగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా కొవిడ్ పరీక్షలు జరపాలని తెలిపింది.
అలాగే.. పండగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా చూడాలని హైకోర్టు కోరింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
KCR ఫామ్‌హౌస్‌లో యువకుడు మృతి.. RSP సంచలన వ్యాఖ్యలు
Next Story