తల్లిపాలలో విషపదార్థాలు.. బయటపడ్డ నిజాలు..

by Shyam |
తల్లిపాలలో విషపదార్థాలు.. బయటపడ్డ నిజాలు..
X

దిశ, ఫీచర్స్ : శిశువుకు తల్లిపాలకు మించిన ఆహారం లేదు. నవజాత శిశువుకు పోషకాలు అందించటమేకాదు.. రోగనిరోధక శక్తిని పెంచేందుకు బీజం వేసేది తల్లిపాలే. అలాంటి పాలల్లో.. ప్రత్యేకించి యూఎస్‌లోని తల్లుల చనుబాలలో అధిక మొత్తంలో విషపదార్థాలు ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో చంటిబిడ్డల ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.

తాజా అధ్యయనంలో భాగంగా 50 మంది తల్లుల నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసిన పరిశోధకులు.. సాధారణ తాగునీటి స్థాయితో పోల్చితే వారి పాలలో PFAS కలుషితాలు 2000 రెట్లు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ‘యూఎస్ వ్యాప్తంగా అందరు తల్లుల్లోనూ ఇదే తీరున ఉండే అవకాశం ఉంది. ఈ హానికరమైన రసాయనాలు ప్రకృతిలోని పరిపూర్ణమైన ఆహారాన్ని కలుషితం చేస్తున్నాయని ఈ అధ్యయనానికి సంబంధించిన సహ రచయిత ఎరికా ష్రెడెర్ వెల్లడించింది’. ‘ఫరెవర్ కెమికల్స్’ గా పిలువబడే ఈ PFASలో దాదాపు 9000 రకాల కాంపౌండ్స్ ఉంటాయి. సాధారణంగా వీటిని ఫుడ్ ప్యాకేజింగ్, క్లాతింగ్, కార్పెంటింగ్ వాటర్, స్ట్రెయిన్ రెసిస్టెంట్‌లో వాడతారు. కాగా ఈ కెమికల్స్‌ మానవుల్లో క్యాన్సర్, థైరాయిడ్, వీర్యకణాల సంఖ్య తగ్గడం, కాలేయ వ్యాధుల వంటి ప్రాణాంతక రోగాలకు కారణమవుతాయి.

ఈ ‘ఫరెవర్ కెమికల్స్’కు సంబంధించి అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. ఇవి ఎప్పటికీ విచ్ఛిన్నం కావు. మానవ శరీరంలో పేరుకొని పోతాయని, తాజా అధ్యయనం ఈ విషయంపై ప్రమాద ఘంటికలు మోగించగా.. చంటిపిల్లలపై అధ్యయనం చేయడం కష్టం కాబట్టే.. నవజాత శిశువుల్లో PFAS ఎఫెక్ట్ గురించి ఇప్పటి వరకు సమగ్ర విశ్లేషణ జరగలేదని, ఈ స్టడీలో పాల్గొన్న మరో రచయిత షీల సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed