ఇందూరు.. స్వీయ నిర్బంధంలో ఊరూరు

by Shyam |
ఇందూరు.. స్వీయ నిర్బంధంలో ఊరూరు
X

దిశ, నిజామాబాద్:
కరోనా వైరస్ (కోవిడ్19) ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. ఈ మహమ్మారి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ అమలుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గ్రామాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 3,196 మంది విదేశాల నుంచి వచ్చారని సమాచారం. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఐసోలేషన్ వార్డులకు పంపాలని గ్రామస్తులు అనుకుంటున్నారు. ఎవరైనా విదేశాల నుంచి వస్తే వారిని 14 రోజులు క్వారంటైన్ చేయాలనీ, కాబట్టి గ్రామాల్లోకి ఎవరైనా విదేశాల నుంచి వస్తే తమకు సమాచారమివ్వాలని అధికారులు చెబుతున్నారు.

చెక్‌పోస్టులు..జరిమానాలతో అలర్ట్..

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 2,203 మంది విదేశాల నుంచి వచ్చారనీ, వారు జనం మధ్య మనం తిరుగుతున్నామని ఆ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సోమవారం ప్రకటించారు. దీంతో జిల్లాలోని గ్రామాల్లో హై అలర్ట్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇండ్ల నుంచి బయటకెళ్లొద్దని గ్రామాలు నిర్ణయించుకున్నాయి. ఆదివారం నాటి జనత కర్ఫ్యూలో ఇంటి నుంచి బయటకు వస్తే రూ.1,000 జరిమానా విధించారు. ఆ మాదిరి ఇవాళ్టి నుంచి 31 వరకూ లాక్ డౌన్‌కు అందరూ సహకరించాలని వీడీసీలు(గ్రామాభివృద్ధి కమిటీ) కోరుతున్నాయి. ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే సామాజిక బహిష్కరణ చేస్తామని చెబుతున్నాయి. దాంతో గ్రామాలన్నీ స్వీయ నిర్బంధం వైపే అడుగులు వేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లివాసులు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నారు. అయితే, ఈ గ్రామాల్లో 90 శాతం మందిఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వేళ్లిన వారే. దీంతో ఇటీవల విదేశాల నుంచి ఎవరైనా సొంత గ్రామానికి వెంటనే క్వారంటైన్ చేయాలని లేదంటే కరోనా విస్తరిస్తుందని ఆ గ్రామాల్లో అధికారులు ప్రచారం చేస్తున్నారు. స్వచ్ఛందంగా వెళ్లి ప్రభుత్వాస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.

Tags: coronavirus (covid-19), effect, nizamabad district, villages, self quarantine

Advertisement

Next Story

Most Viewed