మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్

by Anukaran |
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్
X

దిశ, ములుగు: ములుగు జిల్లా అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును శనివారం రాత్రి మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్, అసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కొంతకాలంగా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

భీమేశ్వరరావును మావోయిస్టులు పలుమార్లు పార్టీ ఫండ్ అడగ్గా తిరస్కరించినందుకే కక్షసాధింపు చర్యగా హత్య చేశారని పేర్కొన్నారు. భీమేశ్వరరావు ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులు ప్రాధేయ పడుతున్నా వినకుండా అతి దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారన్నారు. జిల్లా సరిహద్దు గ్రామాలకు చెందిన గిరిజనులను ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు దూరం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ రోడ్లను తవ్వి సామాన్య ప్రజానీకానికి ఆటంకాలకు గురి చేస్తున్నారని తెలిపారు. మావోయిస్టులు పార్టీ ఫండ్ ఇవ్వని సామాన్య ప్రజలను పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో హత్యాకాండ కొనసాగిస్తున్నారని‌ ఎస్పీ ‌వివరించారు.

Advertisement

Next Story