బిగ్ స్క్రీన్ సమ్‌థింగ్ స్పెషల్: రామ్

by Shyam |
బిగ్ స్క్రీన్ సమ్‌థింగ్ స్పెషల్: రామ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘రెడ్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో AMB సినిమాస్‌లో గురువారం చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా హీరో రామ్ మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తరువాత థియేటర్‌లోకి రావడం కొత్తగా అనిపించిందన్నారు. సినిమా ట్రైలర్ తాను ఇదివరకే రెండు మూడుసార్లు చూశానని, కానీ, బిగ్ స్క్రీన్ పై ఇక్కడ చూడగానే సమ్ థింగ్ స్పెషల్ అనిపించిందని తెలిపారు.

కరోనా నేపథ్యంలో ఎన్నో అవాంతరాలు దాటుకొని సినిమా టాకీసు వద్దకు వచ్చిందని వివరించారు. ‘సోలో బతుకు సో బెటర్’ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రేక్షకులు సినిమాను థియేటర్లలోనే చూడాలని కోరారు. చాలా రోజుల తర్వాత థియేటర్లు ఓపెన్ అవుతున్నాయని తెలిపారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘రెడ్’ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా..మణిశర్మ సంగీతం అందించారు. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా వస్తున్న ‘రెడ్‌’లో నాజ‌ర్ ప్రధానపాత్రలో నటించారు.

Advertisement

Next Story

Most Viewed