బ్యాంకాక్ ట్రిప్‌లో ఆ హీరో నా చనుబాలు తాగాడు… నటి షాకింగ్ కామెంట్స్

by Shyam |
Tahira Kashyap
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి తన భార్య తహీరా కశ్యప్ సంచలన కామెంట్ చేసింది. ఇటీవల ఈ జంట బ్యాంకాక్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయుష్ తన చనుబాలు తాగినట్లు చెప్పింది. అలాగే తమ వ్యక్తిగత విషయాల గురించి ఓ పుస్తకం రాస్తున్నట్లు తెలిపిన తహీరా.. ‘నా ఏడు నెలల కొడుకును మా అమ్మ దగ్గర వదిలేసి నేను, ఆయుష్మాన్ మూడు రోజులు బ్యాంకాక్ ట్రిప్ వెళ్లాం. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందు బాబు కోసం నా చనుబాలను బాటిల్స్‌లో నింపి అమ్మకిచ్చాను. అయినా పాలు వస్తూనే ఉన్నాయి. దీంతో బ్యాంకాక్ వెళ్లిన తర్వాత మా రూమ్‌లో ఉన్న బాటిల్‌లో నింపానని, బాల్కనీలోకి వెళ్లి ఫోన్ మాట్లాడి వచ్చేలోపు ఆ బాటిల్ ఖాళీ అయింది. పక్కనే ఉన్న ఆయుష్మాన్‌ను ఏం జరిగిందని అడిగితే.. పాలను ప్రొటీన్ షేక్‌లో కలుపుకుని తాగేశానని, చాలా రుచిగా ఉన్నాయని చెప్పాడు’ అని వివరించింది. ఇక అప్పటి నుంచి పాల బాటిల్ తన కంట పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది తహీరా.

Advertisement

Next Story