వరల్డ్ మలేరియా డే.. దోమలు ఎక్కువగా చెమటలు పట్టేవారినే ఇష్టపడుతాయని తెలుసా?

by Jakkula Samataha |
వరల్డ్ మలేరియా డే.. దోమలు ఎక్కువగా చెమటలు పట్టేవారినే ఇష్టపడుతాయని తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఎవరైనా సరే ఎక్కువగా భయపడేది అంటువ్యాధులకే. ముఖ్యంగా దోమలతో వ్యాపించే అంటు వ్యాధి మలేరియా అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఇక ఈరోజు .. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. మలేరియా దోమల వలన వచ్చే ఓ అంటువ్యాధి. దీని వలన చాలా మంది మరణిస్తున్నారు. దీంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న మలేరియా పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ఇక మలేరియా బారిన పడిన వారిని కుట్టిన దోమ మనల్ని కుడితే ఆ జ్వరం వచ్చేస్తుంది. అనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమల్లో ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా ఉంటుంది. దానివల్లే మనకి మలేరియా వస్తుంది. వేసవిలో, వానాకాలంలో మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ప్రజలందరూ ఈ సీజన్‌లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలను నీటుగా ఉంచుకోవాలి.

అయితే దోమలు ఎవరిని ఎక్కు కుడతాయి అని చాలా మంది ఆలోచిస్తుంటారు. వారి కోసమే ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్. దోమలు ఎక్కువగా చెమటను ఇష్టపడుతాయంట. చెమట వాసన అంటే వాటికి చాలా ఇష్టం. అందువలన ఏ వ్యక్తి అయితే చెమటలు ఎక్కువ పడుతాయో వారిని దోమలు ఎక్కువగా కుడుతాయి. అలాగే ఒక వ్యక్తి నుంచి కార్బన్ డయాక్సైడ్ వాసన వస్తున్నా, లాక్టిక్ యాసిడ్ వాసన వస్తున్న కూడా దోమలు ఆ మనుషులని కుట్టే అవకాశం ఉంది. భూమిపై ఉన్న జీవుల్లో మనుషులకు ఎక్కువగా వ్యాధులు సోకేలా చేసే జీవులు దోమలే. వీటివల్ల మలేరియా మాత్రమే కాదు డెంగ్యూ, జికా వైరస్, టైఫాయిడ్ వంటి అనేక జ్వరాలు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed