టమాటాలు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..

by Disha Web Desk 20 |
టమాటాలు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
X

దిశ, ఫీచర్స్ : టమాటాలు కూరలకు రుచిని పెంచుతాయి. అందుకే ఏ కూర వండిన కనీసం ఒక్క టమాటా అయినా కూరలో వేయాల్సింది. అంతే కాదు కొంతమంది వీటిని చెక్కర అద్దుకుని పచ్చిగా తింటారు. మరికొంతమంది జ్యూస్ లలో టమాటాల జ్యూస్ కాస్త కలుపుకుని తాగుతుంటారు. ఇక టమాటలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. విటమిన్లు A, B, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అంతే కాదు టమాటాను ముఖానికి రాసుకుంటే చర్మం మెరుగుపడుతుంది. ఎంతో రుచిగా, ఎన్నొ పోషకాలు ఉండే టమాటాల్లో కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని అప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు. మరి ఆ ప్రయోజనాలేంటి, అప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటాలు తినడం వల్ల కలిగే నష్టాలు..

ఎసిడిటీ వచ్చే ప్రమాదం..

టమాటాలు కొద్దిగా ఆమ్లంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అసిడిటీ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. దీంతో కడుపులో మంటలు, అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు టమాటాలను అస్సలే తీసుకోకూడదట.

టమాటాలతో కిడ్నీలో రాళ్లు..

టమాటలో కాల్షియం, ఆక్సలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణం కాక శరీరం నుండి విసర్జన కావు. ఈ ఖనిజాలు కడుపులో పేరుకుపోయి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయని నమ్ముతారు.

టమటాలు తినడం వల్ల కలిగే లాభాలు..

నరాల పనితీరు మెరుగు...

టమాటాలలో ఉండే లైకోపీన్ రక్త నాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా రక్తపోటును సాధారణీకరించడంలో సహాయపడుతుంది.

రక్తపోటును తగ్గిస్తుంది..

టమాటాలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గిస్తుంది..

టమాటాల్లో అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి అవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఫైబర్ త్వరగా కడుపు నింపుతుంది. కేలరీలను తీసుకోవడం తగ్గిస్తుంది.

టమాటాలు ఎలా తినాలి

టమోటాలు ఉడికించి తినడం మంచిది. పచ్చిగా తినాలనుకుంటే గింజలు తీసేసి తింటే ఎసిడిటీ సమస్య ఉండదు.

Next Story

Most Viewed