వాయుయానాసనం ఎలా చేయాలి ప్రయోజనాలేంటి?

by Hamsa |
వాయుయానాసనం ఎలా చేయాలి ప్రయోజనాలేంటి?
X

దిశ, ఫీచర్స్: ఈ ఆసనంలో మొదట నిటారుగా నిలబడాలి. తర్వాత రెండు చేతులను ముందుకు చాచాలి. తర్వాత నెమ్మదిగా నడుమును ముందువైపునకు కిందికి వంచుతూ కుడి కాలిని నేలపై నుంచి వెనక వైపున పైకి లేపాలి. రెండు చేతులను శరీరానికి ఇరువైపులా విమానం రెక్కల వలె చాచాలి. వెనక్కి చాచిన కుడి కాలిని మరింత పైకి లేపాలి. ఇప్పుడు రెండు కాళ్లను '7' ఆకారంలో నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత వెన్నుపూసను నిటారుగా ఉంచి తలను సాగదీస్తూ ముందుకు చూస్తుండాలి. ఈ భంగిమలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ శ్వాస సమతుల్యతపై దృష్టి పెట్టాలి. ఇలా వీలైనంత సేపు ఆగిన తర్వాత కాళ్లను మార్చి చేయాలి.

ప్రయోజనాలు :

* శరీర అవయవాల సమతుల్యతను మెరుగుపరుస్తుంది.

* ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంపొందిస్తుంది.

* కాళ్లు, భుజాల కండరాలకు బలాన్నిస్తుంది.

* ఆకాశంలో తేలియాడుతున్న అనుభూతిని కలిగిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed