వడదెబ్బను గుర్తించడం ఎలానో తెలుసా ?

by samatah |   ( Updated:2023-05-18 04:57:39.0  )
వడదెబ్బను గుర్తించడం ఎలానో తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. తీవ్రమైన వడగాలలు వీస్తుండటంతో చాలా మంది ఎండ వేడిని తట్టుకోలేక వడదెబ్బకు గురి అవుతున్నారు. అంతే కాకుండా వడదెబ్బకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

అయితే వడదెబ్బను ముందుగా గుర్తించడం ద్వారా త్వరగా ప్రథమ చికిత్స ద్వారా ఆ సమస్య నుంచి కోలుకోవచ్చు. అందువలన ఇప్పుడు వడదెబ్బ లక్షణాలు ఏంటో చూద్దాం. బాడీ టెంపరేచర్ 104f దాటి ఉంటుంది. అలానే వడదెబ్బ రాగానే మొట్టమొదటి లక్షణం ఏంటంటే నీరసం లేదా కళ్ళు తిరగడం. దడ పుట్టించే విధంగా తలనొప్పి, అయోమయ స్థితి లేదా అపస్మారక స్థితి, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లు గుర్తించాలి. వెంటనే మొదటగా అతని చల్లటి గాలి ఉండే ప్రదేశంలో కూర్చో బెట్టి, బాడీ టెంపరేచర్ చెక్ చేసి, నీరు తాగించాలి. అనంతరం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి.

Read more:

WARNING : కోక్ తాగుతూ చిప్స్ తింటున్నారా? గుండెపోటు రావచ్చు.

రోజుకు ఒక పండు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Cashew Nuts: కూరగాయలకంటే తక్కువ ధరకే జీడిపప్పు.. కేజీ రూ.15లే.. ఎక్కడో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed