- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వేసవిలో ఆర్థరైటిస్ రోగుల సమస్యలు పెరుగుతాయా..?
దిశ, పీచర్స్ : దేశంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన వేడి కారణంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వేడి కారణంగా చర్మ సమస్యలు, కంటి చికాకు వంటి సమస్యలు సాధారణం. అయితే పెరుగుతున్న వేడి ఆర్థరైటిస్ రోగులకు కూడా ప్రమాదకరమా ? వేడి ఆర్థరైటిస్ రోగుల సమస్యలను పెంచుతుందా ? అనే ప్రశ్నలు చాలామంది మదిలో మెదులుతుంటాయి.
అయితే ఆర్థరైటిస్ కారణంగా రోగికి కీళ్ల నొప్పులు తరచూ వస్తూనే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి చాలా తీవ్రంగా మారి భరించలేడట. ఆర్థరైటిస్ నొప్పి రెండు ఎముకలు ఒకదానికొకటి కలిసే ప్రదేశంలో వస్తుంది. మోకాళ్లు, మోచేతులు, భుజాలు వంటి ప్రాంతాల్లో ఆర్థరైటిస్ కారణంగా నొప్పలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేవి సర్వసాధారణం. కొన్ని దశాబ్దాల క్రితం వరకు వృద్ధులలో కీళ్లనొప్పులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ సమస్య యువకులలో కూడా రావడం మొదలైంది.
విపరీతమైన వేడి ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
వేసవి కాలంలో కీళ్లనొప్పుల రోగులకు ఎలాంటి ప్రత్యేక సమస్య ఎదురుకాదని, అయితే ఆకస్మిక వేడి, చలి వల్ల హాని కలుగుతుందని ఆర్థోపెడిక్స్ వైద్యనిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఆర్థరైటిస్ పేషెంట్ అకస్మాత్తుగా వేడి ఎండ నుండి ఇంటికి వచ్చి ఏసీలో కూర్చుంటే వారు సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. అకస్మాత్తుగా ఏసీలో కూర్చోవడం వల్ల కీళ్లనొప్పులు పెరిగే ప్రమాదం ఉందని, ఆర్థరైటిస్ సమస్య తీవ్రంగా ఉన్నవారు శరీరం పై కప్పుకుని ఏసీలో కూర్చోవాలని చెబుతున్నారు. ఈ సీజన్‌లో కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా ఉంటే, రోగి వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలంటున్నారు.
ఆర్థరైటిస్ రోగుల సంఖ్య పెరుగుదల..
గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఆర్థరైటిస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 14 నుంచి 15 శాతం మంది ఈ సమస్యకు చికిత్స కోసం వైద్యుల వద్దకు వెళుతున్నారు. గత రెండు దశాబ్దాలలో ఆర్థరైటిస్ రోగుల సంఖ్య 12 శాతం పెరిగింది. చెడు జీవనశైలి, బలహీనమైన ఆహారపు అలవాట్లు ఈ వ్యాధి పెరగడానికి ప్రధాన కారణాలని చెబుతున్నారు.
ఎలా రక్షణ పొందాలి...
ఒక వ్యక్తికి ఒకసారి కీళ్లనొప్పులు వస్తే, దానిని మాత్రమే నియంత్రించవచ్చు. దీని కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు ఇస్తారు. అనేక రకాల చికిత్సలు కూడా చేస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే రోగి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎవరైనా ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే, అతని జీవనశైలి, ఆహారపు అలవాట్లు బాగుంటే, అటువంటి రోగికి పెద్దగా ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.