- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లేత ‘చింత’.. ఆరోగ్యానికి లేదు చింత
దిశ, వెబ్‌డెస్క్ : లేత చింత ఆకులను చింతచిగురు అంటారు. చింత చచ్చిన పులుపు చావలేదు అన్న సామెతను మనం వినే ఉంటాము.. దీన్ని మనం చాలా సందర్భాల్లో పోలిక కోసం ఉపయోగిస్తుంటాము. పులుపు ఎలా ఉన్న చింత చిగురుతో మనకు అనేక ప్రయోజనాలున్నాయి. చింతచిగురు రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో చింత చిగురు ఒకటి. చింతచిగురులో యాంటీసెప్టెక్ గుణాలు అధికంగా వుంటాయి. ఇది యాస్ట్రింజెంట్ మాదిరి పనిచేసి మన శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగిస్తుంది.
చింత చిగురులో రోగనిరోధక శక్తి కలిగించే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. చింత చిగురును ఆకుకూరగా వాడుతారు. చింతచిగురును నీడలో ఎండబెట్టి పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అన్నింటిలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించి, రక్తం పట్టేలా చేస్తుంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది.
వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి. చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.