- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నారింజ పండ్లు తింటే ప్రయోజనాలివే..
దిశ, వెబ్‌డెస్క్: నారింజ పండ్లు ఏ సీజన్‌లో అయినా మార్కెట్‌లో లభిస్తాయి. ఈ పండ్ల ధర కూడా తక్కువగానే ఉంటాయి. నారింజ పండ్లను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
నారింజ పండ్లను తినడం ద్వారా ఊబకాయుల్లో గుండె సమస్యలు, మధుమేహం, కాలేయ వ్యాధులను నివారించవచ్చు. వీటిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఊబకాయుల్లో హానికర ప్రభావాల్ని యాంటీఆక్సిడెంట్లు నివారిస్తాయి. ముఖ్యంగా ఇవి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తినడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది.
నారింజ పండ్లలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజు ఈ పండ్లను తీసుకోవడం ద్వారా కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు పోతాయి. దీంతో సంతాన సాఫల్యత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నారింజ పండ్లను తినడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చు.
నారింజ పండ్లు మలబద్దకాన్ని పోగోడుతుంది. రాత్రి పూట నారింజ పండ్లను తింటే మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. ఆస్తమా ఉన్నవారు, వెంట్రుకల సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ పండ్లను తినడం ద్వారా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. దంత సమస్యలు ఉన్నవారు నారింజ పండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే ఔషధ గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి.