ఒకరినొకరు కాల్చుకున్న ఎస్ఐ, కానిస్టేబుల్ మృతి

by Sumithra |   ( Updated:2021-12-26 01:10:09.0  )
Army
X

దిశ, ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివారం సీఆర్పీఎఫ్ ఎస్ఐ, జవాన్ పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. వెంకటాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలోని భోజన శాలలో భోజనం తయారీ విషయంలో ఆదివారం ఉదయం 8:30 గంటలకు సీఆర్పీఎఫ్ 30వ బెటాలియన్ కు చెందిన ఎస్ఐ ఉమేశ్ చంద్ర, మెస్ ఇన్ చార్జ్ అయిన కానిస్టేబుల్ స్టీఫెన్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తీవ్ర ఆవేశానికి గురైన వారిద్దరూ పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో బిహార్ కు చెందిన ఉమేశ్ చంద్ర అక్కడికక్కడే మరణించగా తమిళనాడుకు చెందిన స్టీఫెన్ ను ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య జరిగిన ఘర్షణకు దారి తీసిన పరిణామాల గురించి ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

army-2


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed