- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనాతో హెడ్ కానిస్టేబుల్ మృతి

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ బాబునాయక్ ఈ నెల 9న పాజిటివ్ అని తేలడంతో నగరంలోని మనోరమ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. 15న డిశ్చార్జి అయి హోం అసోలేషన్ లో ఉంటున్నాడు. ఈ నెల 16న ఆరోగ్యం క్షిణించడంతో నగరంలోని ప్రతిభ ఆసుపత్రిలో చేరాడు. 17న రాత్రి చికిత్స పొందుతూ మరణించినట్లు మహిళ పోలీస్ స్టేషన్
సీఐ మస్తాన్ అలీ తెలిపారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం తండాకు చెందిన బాబునాయక్ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. గతంలో నిజామాబాద్ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ లలో కానిస్టేబుల్ గా పని చేసిన బాబునాయక్ పక్షవాతం కారణంగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. గత మూడు సంవత్సరాలుగా మహిళ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న బాబునాయక్ మృతి పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.