- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా నుంచి కోలుకుని ఇతరులకు సాయపడ్డాడు
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్(కోవిడ్-19) సోకిన ఓ వ్యక్తి పూర్తిగా కోలుకుని, ఆ తర్వాత ఇతరులకు సాయపడిన ఓ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాలేమిటంటే.. కాలిఫోర్నియాకు చెందిన జాసన్ గార్సియా అనే ఓ వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. విషయం తెలుసుకుని ఇంట్లోనే చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ఎస్కోబెడో ఆసుపత్రి వారు గార్సియాను సంప్రదించారు. తమ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కూడా కరోనాతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, ఏ మాత్రం కూడా అతను చికిత్సకు స్పందించడంలేదని, అందువల్ల మీరు ప్లాస్మాను అతనికి విరాళంగా ఇచ్చి అతడిని కాపాడాలని కోరారు. వెంటనే అతను ప్లాస్మాను విరాళంగా ఇచ్చేశాడు. దీంతో ఆ వ్యక్తి కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం.
Tags: Corona, America, California, Treatment, Plasma,
Next Story