- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అందోల్‌లో క్రాస్ ఓటింగ్..? టెన్షన్‌లో అభ్యర్థులు..
దిశ, అందోల్: మెదక్ శాసన మండలి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌పై అందోలు నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. జోగిపేట ఆర్‌డీవో కార్యాలయంలో అందోలు, పుల్కల్, చౌటకూర్, మునిపల్లి, వట్‌పల్లి మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఓటు వేశారు. మెుత్తం 71 మంది ఉండగా వీరిలో ఇద్దరు ఓటింగ్ దూరంగా ఉన్నారు. 69 మంది తమ ఓటు హక్కును ఈ నెల 10న వినియోగించుకున్నారు. వీరిలో కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌కు ఓటేశారని, టీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేశారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది.
టీఆర్‌ఎస్ పార్టీకి కావలసిన మెజార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అధిష్టానంపై అసంతృప్తితో ఉండడం వల్ల వారు క్యాంప్ రాజకీయాలు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. టీఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన టేక్మాల్ ఎంపీపీ టీఆర్ఎస్ పార్టీలో చేరారని, ఇంకొందరు ఎమ్మెల్యేతో రహస్యంగా టచ్‌లో ఉన్నారని టీఆర్ఎస్ నాయకులు చెప్పకుంటున్నారు. ప్రజాప్రతినిధులను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు కొంత కమిట్‌మెంట్ ఇచ్చినట్లు కూడా సమాచారం.