- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్ జిహాద్ కట్టడికి కొత్త చట్టం : హర్యానా
దేశంలో కొత్తగా లవ్ జిహాద్ కేసులు వెలుగులోకి వస్తుండటంతో హిందూ సంఘాలు, పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పెళ్లికి నిరాకరించిందని ఓ హిందూ యువతిని ముస్లిం యువకుడు తొలుత కిడ్నాప్‌కు చేసేందుకు యత్నించగా ఆమె ప్రతిఘటించింది. దాంతో ఆ యువతిని తుపాకితో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగులోకి రావడంతో అక్కడి హిందూ సంఘాలు, పలువురు ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లో ‘లవ్ జిహాద్’కేసులు నమోదు కాకుండా ఉండేందుకు కొత్త చట్టం తీసుకువచ్చేందుకు యోచిస్తున్నట్లు హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. లవ్ జిహాద్‌ను కట్టడి చేయడానికి కఠిన చట్టం తీసుకువస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, కేంద్ర ప్రభుత్వం సైతం లవ్ జిహాద్ కేసులకు చెక్ పెట్టడానికి యోచిస్తున్నదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టంచేశారు.
ప్రతి రాష్ట్రం ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గాలను అన్వేషిస్తున్నాయని, తమ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంపై చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, కొత్త చట్టం వలన తప్పుగా కేసులు నమోదయ్యే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, వచ్చే ఏడాది అసోం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ షురూ చేసింది. లవ్ జిహాద్ అనగా ముస్లిం పురుషుడు హిందూ యువతిని ప్రేమ పేరుతో వలలో వేసుకుని, పెళ్లి అనంతరం మతమార్పిడులకు పాల్పడటాన్నే లవ్ జిహాద్‌గా చెప్పుకుంటున్నారు.