చిల్లా సరిహద్దులో వెల్లువిరిసిన సామరస్యం

by Shamantha N |
చిల్లా సరిహద్దులో వెల్లువిరిసిన సామరస్యం
X

న్యూఢిల్లీ: రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఢిల్లీ రణరంగంగా మారింది. ఎర్రకోట, ఇన్‌కం ట్యాక్స్ ఆఫీస్ సమీపంలో పోలీసులు, రైతులకు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓ రైతు మృతిచెందగా, చాలా మంది గాయపడ్డారు. మరోవైపు ఇందుకు భిన్నంగా చిల్లా సరిహద్దులో రైతుల ఆందోళన ప్రశాంతంగా కొనసాగింది. రైతులు, పోలీసులు పరస్పరం గులాబీలు ఇచ్చి పుచ్చుకుని సామరస్యతను చాటారు.

భారతీయ కిసాన్ యూనియన్(భాను) యూపీ చీఫ్ యోగేశ్ ప్రతాప్ సింగ్‌కు నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ రణ్‌విజయ్ సింగ్ గులాబీలను అందజేశారు. ఆందోళన చేస్తున్న రైతులు వండిన ఆహారాన్ని భుజించారు. ఈ సంఘటన అనంతరం బీకేయూ(భాను) సభ్యులు, మద్దతుదారులు చిల్లా సరిహద్దులోకి రావడానికి ఎలాంటి ఆంక్షలు విధించమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. నోయిడా అదనపు డిప్యూటీ కమిషనలర్ ఈ మాట చెప్పగానే రైతులు ఆయనకు గులాబీలు ఇచ్చి హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed