- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఇంటింటా కోవిడ్ సర్వే: హరీష్ రావు
దిశ, సిద్దిపేట: దేశానికే స్ఫూర్తిగా నిలిచిందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట ప్రభుత్వ కళాశాల ఆస్పత్రి కోవి డ్ icu, జనరల్ వార్డుల సందర్శన అనంతరం రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.icu, జనరల్ వార్డులలో కరోనా బాధితులతో తాను స్వయంగా మాట్లాడానని బాధితులకు అందుతున్న వైద్య చికిత్స గురించి వారు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. ఆసుపత్రిలో సరిపడా ఆక్సిజన్, రెమిడీ సీవ ర్, మందులు కొరత లేదని వారు తెలిపార న్నారు. మూడు పూటలా సంతులిత ఆహారం వేడివేడిగా అందిస్తున్నారని పేషెంట్లు తెలిపారని మంత్రి అన్నారు.
సిద్దిపేటలో కరోనా ఉధృతిని అరికట్టేందుకు ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు వీలుగా సిద్దిపేటలో ఇంటింటా సర్వే నిర్వహించామని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో 2,26,314 ఇళ్లను పరిశీలించగా 7064 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే పట్టణ ప్రాంతాలలో 70, 218 ఇండ్లను పరిశీలించగా 2,100 మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మెడికల్ కిట్ లు అందించామని మంత్రి తెలిపారు.
అలాగే సర్వే లో తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల మంది కి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి సకాలంలో మెడికల్ కిట్ అందించి ప్రాథమిక వైద్య సేవలు అందేలా చూశామని మంత్రి తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ రేటు తగ్గిందన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ప్రాథమిక దశలోనే వైద్యం అందించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. పేషంట్ లు సీరియస్ కాకుండా చూడడం తో పాటు ఆక్సిజన్ అవసరం లేకుండా చూడగలిగాం అన్నారు.
వ్యాధి లక్షణాలు ఉన్న బాధితులతో ఉదయం సాయంత్రం పూట అంగన్వాడి ఆశావర్కర్లు మాట్లాడుతూ వారి ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తున్నారని మంత్రి తెలిపారు.మొదటి సర్వే మంచి ఫలితాలు ఇవ్వడంతో రెండో సర్వే కూడా చేపడుతున్నామని మంత్రి తెలిపారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణలో నిర్వహించిన సర్వే ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు . దేశ ప్రధానమంత్రి ఈ సర్వేను దేశంలోని అన్ని ప్రాంతాలలో నిర్వహించాలని చెప్పడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి తెలిపారు.
రెమిడీ సివర్ , ఆక్సిజన్ కొరత లేదు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన లకు 5 లక్షల రెమిడీ సివర్ ఇంజక్షన్లు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. తాలూకా స్థాయిలోనీ ప్రభుత్వ కూడా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు . రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన లో ఎక్కడా కూడ రెమిడీ సిల్వర్ ఇంజెక్షన్ల కొరత లేదన్నారు. అవసరమైనవారికి ఇంజెక్షన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఆక్సిజను కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత పేషంట్ లు చనిపోయిన పరిస్థితి చూశామన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల తెలంగాణ లో ఎక్కడ అలాంటి ఘటనలు జరగలేదని మంత్రి తెలిపారు.
వాక్సినేషన్ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ముందంజలో ఉందన్నారు. ఇప్పటివరకు 2,19,986 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామని తెలిపారు. 45 సంవత్సరాలు నిండిన వారిలో 98 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందన్నారు.కొవీ షేల్డ్ రెండో తీసుకునే పరిమితి ఆరు వారాల నుంచి 12 వారాల లోపు పెంచడంవల్ల ప్రస్తుతం జిల్లాలో రెండో వ్యాక్సిన్ తీసుకునేవారు ఎవరూ లేరన్నారు.COVAXIN డోసులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే 45 ఏళ్ల పైబడిన వారికి రెండో డోస్ వాక్సిన్ ఇస్తామన్నారు.
అలాగే సిద్దిపేట జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా 5,15,378 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు.వీరిలో 28,450 మందికి ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు 4,86,927 మందికి రాపిడ్ టెస్ట్ పరీక్షలు నిర్వహించామన్నారు. వీరిలో 31,0 73 మంది కి పాజిటివ్ వచ్చిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ మెడికల్ కిట్లను అందించామని తెలిపారు.
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో 705 మందికి కరోనా చికిత్స అందించడం జరిగిందన్నారు. 4, 192 మందికి రెమిడి సివర్ ఇంజెక్షన్లను ఉచితంగా అందించామని మంత్రి తెలిపారు.సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 13 వేల లీటర్ల ఆక్సిజన్ నిల్వ ప్లాంట్ ఉండడంవల్ల ఆక్సిజన్ సమస్యలు తలెత్తే లేదని మంత్రి తెలిపారు. ఒకసారి ఈ ప్లాంటు నింపితే ఐదు నుంచి ఆరు రోజుల వరకు ఆస్పత్రి అవసరాలకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందన్నారు.
త్వరలో ఆక్సీజన్ ఉత్పత్తి ప్లాంట్
Siddipet ఆసుపత్రిలో ఒక గంటకు వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తిచేసే ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటును సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఆసుపత్రుల తో కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఉన్న పేషెంట్లకు ఒక్కో పేషంట్ కు రోజుకు రూ 250 వెచ్చించి క్వాలిటీ డైట్ ను మూడు పూటలా పెడుతున్నామని మంత్రి తెలిపారు.
సిద్దిపేట కు నర్సింగ్ కళాశాల
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఒక నర్సింగ్ కళాశాలలు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను కోరిన వెంటనే సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఒక నర్సింగ్ కళాశాల ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు.
చారు.బుధవారం సాయంత్రం ఆసుపత్రి సందర్శన అనంతరం ప్రభుత్వం ఆసుపత్రి మీటింగులో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సమావేశం నిర్వహించారు.
4 గురు వైద్య అధికారులు ఒక కోర్ టీమ్ చొప్పున ఏర్పడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజు ఒకసారి సమీక్షించాలని మంత్రి ఆదేశించారు . ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్న పేషెంట్లను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా ఈ వైద్యాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 108 మంది వైద్యులు 316 మంది స్టాఫ్ నర్సు ఉన్నారని మంత్రి తెలిపారు.పేషెంట్లు 195 మంది ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రతి ఒక పేషెంట్ లేదా ఇద్దరు పేషెంట్లకు ఒకరి చొప్పున స్టాఫ్ నర్సులు ఉంటూ బాధితుల ఆరోగ్య పరిస్థితిని కనిపెట్టుకుని వారు త్వరగా క్యూర్ అయ్యేలా చూడాలన్నారు.
RMO, ఆసుపత్రి సూపరీంటెండెంట్ లు రోజుకు మూడు సార్లు కో విడ్ వార్డులలో రౌండ్ లు చేయాలన్నారు. పేషెంట్లలో ధైర్యాన్ని నింపుతూ వారు త్వరగా కోలుకునేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఆసుపత్రి లోపల బయట శానిటేషన్ మరింతగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. డా. ఇజారత్, డా కాశీ నాథ్, డా. హేమలత, డా. చంద్ర శేఖర్ లు ప్రతి రోజూ ఆస్పత్రిలో ఆరు గంటల చొప్పున పనిచేస్తూ పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరిచేలా చూడాలన్నారు.