- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి 'హరీశ్ రావు భార్య' ఓటెయ్యరా..?
దిశ ప్రతినిధి, సిద్దిపేట: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనది. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన వారికి హక్కు కల్పించింది. ఇదే మాట రాజకీయ నేతలు, ఎన్నికల అధికారులు ప్రతిసారి చెబుతూనే ఉంటారు. కానీ, తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత, మంత్రి భార్య ఓటు హక్కు వినియోగించుకోకపోవడం చర్చనీయాంశం అయింది.
ఎన్నికలు ఏవైనా మంత్రి హరీశ్ రావు తన సతీమణి శ్రీనిత రావుతో కలిసి ఓటు వేసేవారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆయన ఒక్కరే వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ ఓటేయాలని పిలుపునిచ్చిన మంత్రి కుటుంబంలోని వ్యక్తులే ఎందుకు రాలేదని సిద్దిపేటలో చర్చలు మొదలయ్యాయి. పట్టణంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే శ్రీనిత ఓటు వేసేందుకు రాలేదని ఆ పార్టీ నేతల చర్చించుకుంటున్నారు. ఓ వైపు కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, అధికారులు స్పష్టం చేసినా.. ఎందుకు రాలేదో చెప్పాలంటున్నారు. 'మీ ప్రభుత్వం పైన మీకే నమ్మకం లేకుంటే మేము ప్రజలు ఎలా నమ్మాలంటూ' కుండ బద్దలు కొడుతున్నారు పలువురు. అధికార పార్టీ కుటుంబంలోని వారే ఓటేయ్యడానికి రాకుంటే.. సాధారణ ప్రజలు ఎలా వస్తారని.. అసలు హరీశ్ రావు ఎందుకు వెంటే తీసుకురాలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దీనిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.