- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుండెల్లో గులాబీలు పూయిద్దాం : హరీశ్ రావు
దిశ, మెదక్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి, పార్టీ జెండాను మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్ఎస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్ఫూర్తి కలకాలం నిలవాలనీ, ఉద్యమ దీప్తి ఇలాగే వెలుగొందుతూ ఉండాలని తెలిపారు. రెండు దశాబ్దాలుగా రెండు లక్ష్యాలు పెట్టుకున్నామని, మొదటి లక్ష్యం తెలంగాణ రాష్ర్ట సాధన పూర్తయ్యిందని, రెండో లక్ష్యం బంగారు తెలంగాణ నిర్మాణం అని అది నిర్మాణమవుతున్నదని అన్నారు. ఉద్యమాన్ని ఎంత నిబద్ధతతో నడిపించారో, ప్రభుత్వాన్ని కూడా అంతే నిబద్ధతతో నడిపిస్తున్నారని అన్నారు. రెండు దశాబ్దాల ఘన చరిత్రను సగర్వంగా స్మరించుకుంటూ, ఈ వార్షికోత్సవ శుభవేళ అందరికీ మంత్రి హరీష్ రావు శుభాభివందనాలు తెలియజేశారు. సత్యమే దైవంగా, సేవే మార్గంగా, త్యాగమే ఆభరణంగా, తెలంగాణ సమగ్ర నిర్మాణమే ధ్యేయంగా, సమతా భారతమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో మరో ఉజ్వల ప్రస్థానాన్ని కొనసాగిద్దామని, గుండె గుండెలో గులాబీ పూవులు పూయిద్దామని అన్నారు.
Tags : minister Harish Rao, TRS emergence day, flag hoisting, medak