- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బర్త్‌డే రోజున ఎంపీకి సర్‌ప్రైజ్ ఇచ్చిన హరీష్
దిశ, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంకల్పం గొప్పదని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రకృతి ప్రకోపిస్తే అల్లకల్లోలమే జరుగుతుందని, దాన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని అన్నారు.
ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి మొక్కలు నాటుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని హరీశ్ అన్నారు. సంతోష్ చేస్తున్న కృషికి తాను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఎంపీ సంతోష్ కోరినట్లుగానే తన అనుచరులు, అభిమానులు కూడా తమవంతుగా మొక్కలు నాటి, గ్రీన్ ఇండియా సంకల్పాన్ని సక్సెస్ చేస్తారని మంత్రి హరీశ్ అన్నారు.