పవన్ 20 ఇయర్స్ చాలెంజ్.. వైరల్‌గా ‘హరిహర వీరమల్లు’ పిక్స్

by Jakkula Samataha |
పవన్ 20 ఇయర్స్ చాలెంజ్.. వైరల్‌గా ‘హరిహర వీరమల్లు’ పిక్స్
X

దిశ, సినిమా : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రం టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘హరి హర వీరమల్లు’గా పవన్‌ ఫస్ట్ లుక్‌ చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. పవన్‌లో ఉన్న ఫైర్‌కు ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అని చెప్తున్నారు. సినిమా కోసం ఆయన ఫిజికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, స్టైల్‌కు సెల్యూట్ చెప్తూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మహాశివరాత్రికి అదిరిపోయే బహుమతి అందుకున్న అభిమానులు ఆనందంలో మునిగితేలుతుండగా.. ఒక్క చిన్న గ్లింప్ సూపర్ కిక్ ఇచ్చిందని చెప్తున్నారు. అంతేకాదు ‘పవన్ 20 ఇయర్స్ చాలెంజ్’ పేరుతో ‘ఖుషి, జాని, హరిహర వీరమల్లు’ చిత్రాల్లో పవన్ యాక్షన్ స్టంట్స్‌ను షేర్ చేస్తున్నారు.

డైరెక్టర్ క్రిష్ విజన్, కీరవాణి అమేజింగ్ మ్యూజిక్, గ్రాండ్ విజువల్స్, పవన్ సూపర్ అండ్ స్టైలిష్ కటౌట్ కలిసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని చెప్తున్నారు. లెజెండరీ బందిపోటు వీరోచిత గాథగా వస్తున్న సినిమా రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా.. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌తో పాటు మలయాళ, కన్నడ భాషల్లో 2022 సంక్రాంతికి విడుదల కానుంది.

Advertisement

Next Story

Most Viewed