- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేతన్నల దీక్షలు.. రూ.8 వేలు ఇవ్వాలంట
దిశ, మునుగోడు: చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ గత ఐదు రోజులుగా యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల చేనేత ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా చేనేత రిలే నిరాహార దీక్షలకు రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యేడం బాబురావు, చేనేత సహకర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు హాజరై మాట్లాడారు. కరోనా ప్రభావంతో చేనేత వస్త్ర మార్కెట్లో మూతపడినందున రాష్ట్ర ప్రభుత్వమే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని, చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలని, లాక్‌డౌన్ కాలంలో ప్రతి చేనేత కార్మికునికి నెలకు 8 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కూరపాటి రమేష్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవ్వారు భాస్కర్, రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు కోమటి సంధ్య, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట రామచంద్రం హాజరై మద్దతు తెలిపారు.