- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు నేనే నచ్చను.. అందుకే చనిపోతున్నా !
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లాలో టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నాకు నేనే నచ్చను, నేనన్నా ఎవరికీ ఇష్టంలేదు, అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా, సంతోషం ఆవిరవుతున్న క్షణం ఇది అంటూ సూసైడ్ నోట్ రాసి గురుకుల పాఠశాలలో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాడేరు మండలం లగిజేపల్లికి చెందిన గురుపల్లి పూజారి హరికృష్ణ, సరస్వతి దంపతుల కుమారుడు సౌజిత్ రాజు గురుకుల పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. సొమవారం స్కూల్లో ‘అమ్మ ఒడి’ కార్యక్రమం జరిగిన తరువాత మధ్యాహ్నం నుంచి అందరూ సంక్రాంతి పండగ సందర్భంగా ఇంటికి వెళ్లారు.
ఇదేక్రమంలో సౌజిత్ రాజు కూడా ఇంటికి వెళ్తున్నట్లు రిజిస్ట్రర్‌లో పేరు రాశాడు. టీచర్లకు ఇంటికి వెళ్తున్నానని చెప్పి కొయ్యూరు వరకు వెళ్లి, అనంతరం తన ఫ్రెండ్స్‌తో మా నాన్న వచ్చి తీసుకెళ్లాడని చెప్పి రాత్రివరకు హాస్టల్‌కు వెళ్లాడు. నా చావుకు ఎవరు బాధ్యులు కాదు, నాకు జీవితంపై విరక్తిగా ఉందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని 6పేజీల లేఖ రాసి హాస్టల్ గదిలో ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. మంగళవారం ఉదయం లైట్లు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి సౌజిత్ రాజు ఉరేసుకొని కనిపించడంతో వెంటనే ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వెంకటరమణ, ఎస్ఐ నాగేంద్ర స్కూల్‌కు వెళ్లి పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.