- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అనారోగ్యంతో గురుకుల విద్యార్థి మృతి
దిశ, లింగాల: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని దారారం గ్రామానికి చెందిన గురుకుల విద్యార్థి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న ప్రభాస్ (15) అనే విద్యార్థి అనారోగ్యం తో మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి ఇండ్ల గోపాల్‌కు ఒక్కగానొక్క కుమారుడు అని తెలిపారు. నవంబర్ 29న పాఠశాలలో క్రీడల్లో పాల్గొనే సమయంలో తన కాళ్లకు గాయం అయినట్లు తెలిపారు. కాలికి గాయం కావడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
ఇదే క్రమంలో విద్యార్థికి మలేరియా, టైఫాయిడ్ జ్వరం, రావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున సొంత గ్రామంలో విద్యార్థి మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం పై స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, దళిత సంఘాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద్ ఖన్నాతో సమావేశం అయ్యారు. సమావేశంలో విద్యార్థికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆదుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ప్రధానోపాధ్యాయులు వినోద్ ఖన్నా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నట్లు సమాచారం.