దారుణం: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్స్ దందా

by srinivas |   ( Updated:2021-05-10 21:43:54.0  )
Guntur Government Hospital
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో దారుణ ఘటన వెలుగుజూసింది. గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగుల నుంచి విచ్చలవిడిగా బెడ్స్ దందా కొనసాగుతోంది. ఆస్పత్రి సిబ్బంది బెడ్స్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కో పేషెంట్ నుంచి భారీగా డబ్బు డిమాండ్‌ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం డబ్బులు డిమాండ్ చేసిన వార్డు బాయ్ శ్రీనివాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో విషయం తెలిసిన ఆస్పత్రి సూపరింటెండెంట్ వార్డు బాయ్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. అయితే ప్రభుత్వం కరోనా విస్తరిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేయకుండా మానవత్వం ప్రదర్శించాలని సూచిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరంగా మారింది.

Advertisement

Next Story