ఐస్‌క్రీమ్ ఎక్కడ అమ్మినా 18 శాతం జీఎస్టీనే కట్టాలి

by Harish |
ICE-Creame-1
X

దిశ, వెబ్‌డెస్క్: ఐస్‌క్రీమ్‌లపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) 18 శాతమే వర్తిస్తుందని ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. ఐస్‌క్రీమ్ రెస్టారెంట్ లోపలైనా, బయటైనా దానిపై ఒకే పన్ను విధానం ఉంటుందని వెల్లడించింది. ఐస్‌క్రీమ్ రెస్టారెంట్ లోపల విక్రయించినప్పటికీ 18 శాతం జీఎస్టీ అమలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. గతంలో రెస్టారెంట్ లోపల విక్రయించే ఐస్‌క్రీమ్‌పై 5 శాతంగానూ, రెస్టారెంట్ బయట విక్రయించే వాటిపై 18 శాతం జీఎస్టీ ఉండేది. ఐస్‌క్రీమ్ పార్లర్లు తయారు చేసిన వాటినే విక్రయిస్తారు. రెస్టారెంట్లలో తయారు చేసే పదార్థం కాదు. ఐస్‌క్రీమ్‌ని ఇతర వస్తువుల తరహాలోనే సరఫరా చేస్తారు. సరఫరాలో కొన్ని పదార్థాలు ఉన్నప్పటికీ, పార్లర్ ద్వారా గానీ, ఇతర ఔట్‌లెట్ల ద్వారా విక్రయించే ఐస్‌క్రీమ్‌లపై 18 శాతం జీఎస్టీనే విధించబడుతుందని’ ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను అధికారులు చెప్పారు. ఇటీవల పలు ఉత్పత్తుల జీఎస్టీ విధింపు గురించి అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. అప్పడాలు, లస్సీ, సమోసాలపై జీఎస్టీ అంశం నడుస్తోంది. ఇదివరకు కూడా ఆహార పదార్థాలపై జీఎస్టీ వర్తించే అంశం చర్చకు వచ్చింది. నాన్ రోటీ, సమోసా లాంటి పదార్థాలు స్టోర్ బయట కూడా తినే అవకాశం ఉన్న కారణంగా ఇలాంటి వాటిపై జీఎస్టీ వేరుగా ఉండాలనే వాదన జరుగుతోన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story