మరోసారి భేటీ కానున్న జీఎస్టీ కౌన్సిల్

by Harish |
gst
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా నియమించిన మంత్రివర్గ సంఘం నివేదిక అందజేసిన నేపథ్యంలో శనివారం మరోసారి జీఎస్టీ సమావేశం భేటీ కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కొవిడ్ చికిత్సలో అవసరమైన వస్తువులతో పాటు బ్లాక్ ఫంగస్ ఔషధాలపై జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు పేర్కొన్నారు. గత నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభ్యులు కొవిడ్ చికిత్సలో వాడుతున్న పీపీఈ కిట్లు, వ్యాక్సిన్, మాస్క్‌లపై జీఎస్టీ పన్ను మినహాయింపు కోరారు. దీనికోసం అధ్యయనం చేసేందుకు ఆర్థికశాఖ మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘం గత వారం 7న నివేదికను సమర్పించింది. ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్‌లకు 5 శాతం, కరోనా మందులు, ఆక్సిజన్ కాన్సంట్రేషన్లకు 12 శాతం జీఎస్టీ అమలవుతోంది.

Advertisement

Next Story

Most Viewed