- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ దిగుమతులపై ఐజీఈస్టీ తొలగించే అవకాశం!
దిశ, వెబ్‌డెస్క్: వ్యక్తిగత వినియోగం కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ల దిగుమతులపై 12 శాతం జీఎస్టీ పన్ను విధింపు అంశంపై ఈ నెల 28న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. గతవారం ఢిల్లీ హైకోర్టు వ్యక్తిగత వినియోగానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌పై 12 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ) విధించడం రాజ్యంగ విరుద్ధమని తెలిపింది. శుక్రవారం జరగబోయే సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని జీఎస్టీ కౌన్సిల్ వర్గాలు తెలిపాయి. ఆదాయ పరమైన చిక్కులు పెద్దగా లేనందున ఇలాంటి వాటి దిగుమతులపై ఐజీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పన్ను నిపుణులు తెలిపారు.
కొవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను ఉచితంగా దిగుమతి చేసుకోవడంపై ప్రభుత్వం ఇప్పటికే ఐజీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు పన్ను నిపుణులు అభిషేక్ జైన్ చెప్పారు. ప్రస్తుతం దేశీయ సరఫరా, వ్యాక్సిన్ దిగుమతులపై 5 శాతం, జీఎస్టీ, కరోనా మందులు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌పై 12 శాతం ఉంది. కాగా, వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌పై మే 1న ప్రభుత్వం ఐజీఎస్టీని 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు జూన్ 30 వరకు వర్తిస్తుంది.