పెరుగుతున్న టోల్ కలెక్షన్లు

by Shyam |
పెరుగుతున్న టోల్ కలెక్షన్లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ సడలింపుల తర్వాత తెలంగాణలో జాతీయ రహదారులపై టోల్ కలెక్షన్ క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రస్తుతం 18 ప్రాంతాల్లో టోల్ కలెక్షన్ ప్లాజాలున్నాయి. వీటి నుంచి సాధారణంగా నెలకు రూ.80 నుంచి 90 కోట్ల దాకా రుసుము వసూలవుతుంటుంది. అయితే కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్రంలో మార్చి 23 నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో వసూళ్లు ఒక్క సారిగా పడిపోయాయి. లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో అమలులో ఉన్న ఏప్రిల్‌లో ఫాస్ట్ ట్యాగ్, నగదు చెల్లింపులు అన్ని కలిపి కేవలం రూ.11.66 కోట్లు రాగా సడలింపులతో లాక్‌డౌన్ 3.0 స్టార్టైన మే నెలలో వసూళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగి రూ.59.15 కోట్లకు చేరుకున్నాయి. ఇక జూన్ నెలలో ఇప్పటివరకు అంటే 13 రోజుల్లో రూ.18.08 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది జనవరి నెలలో రూ.91.7 కోట్లు, ఫిబ్రవరిలో 90.66 కోట్లు, మార్చిలో 70.58 కోట్లు టోల్ కలెక్షన్లు జమయ్యాయి. సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని నేషనల్ హైవేలపై మరో 2 టోల్ ప్లాజాలు ప్రారంభమవనున్నాయని, దీంతో కలెక్షన్లు మరింత పెరగనున్నాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏ‌ఐ) రీజనల్ అధికారి ఎ.కృష్ణప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story