బలిపశువును చేస్తారా.. ‘ఈటల’ ఇంటికి భారీగా మద్దతుదారులు

by Shyam |
బలిపశువును చేస్తారా.. ‘ఈటల’ ఇంటికి భారీగా మద్దతుదారులు
X

దిశ, హుజురాబాద్: ఈటల రాజేందర్‌‌ను కేబినెట్‌ నుంచి బర్త్‌రఫ్ చేసిన అనంతరం తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆయన బీజేపీలో చేరుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోండగా.. ఆయనకు మద్దతు దారులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కేడర్ పెద్దఎత్తున వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారుజామునే సుమారు వెయ్యి మంది కార్యకర్తలు శామీర్‌పేటకు వెళ్లారు. ఇందులో స్థానిక ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సెర్లు ఈటల నివాసానికి బయల్దేరారు. అయితే, ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించడంతో కేడర్‌లో అధిష్టానంపై అసంతృప్తి మొదలైంది. రాజేందర్‌ను బలిపశువును చేశారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మద్దతుగా తరలివెళ్తున్నారు.

Advertisement

Next Story