- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణకు గ్రీన్ కో సాయం.. ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో నేడు రాష్ట్ర ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి ప్రత్యేకంగా వచ్చిన విమానంలోని ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లకు శంషాబాద్ విమానాశ్రయంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు అందించారు. ఈ సందర్భంగా గ్రీన్ కో సంస్థ యాజమాన్యానికి మంత్రి, సీఎస్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడికి సాధ్యమైనన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు. గ్రీన్ కో సంస్థ తెలంగాణకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించడం పట్ల మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమయంలో కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని, అయితే ఇప్పుడు అత్యవసరమైన ఆక్సిజన్ అందించే కాన్సెంట్రేటర్లలను చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సరుకుని చైనా నుంచి తెలంగాణకి తీసుకువచ్చేందుకు ఇండిగో సంస్థ సైతం తన ప్యాసింజర్ ఫ్లైట్‌ని ఉపయోగించి మరీ తీసుకురావడం ఇండిగో యాజమాన్యం గొప్పతనం అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నందున.. ఆ మేరకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరగా, వారు సానుకూలంగా స్పందించారని కేటీఆర్ అన్నారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయాలకతీతంగా అందర్నీ కలుపుకొని ముందుకు పోతున్నామని తెలిపారు. ఆక్సిజన్ మరియు మందుల సరఫరా విషయంలో తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాల కన్నా మెరుగైన పరిస్థితిలో ఉందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఆక్సిజన్ అందక జరిగిన దురదృష్టకర సంఘటనలు తెలంగాణలో నమోదు కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు కృషి చేస్తూ వస్తున్నదని వెల్లడించారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న వైద్య సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతున్నదని అన్నారు.