మొక్కలు నాటి సంరక్షించాలి : ఎస్పీ

by Sridhar Babu |
మొక్కలు నాటి సంరక్షించాలి : ఎస్పీ
X

దిశ, నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అది అందరి అభిమతంగా మారినప్పుడే గ్రీన్ ఛాలెంజ్, హరితహారం లాంటి కార్యక్రమాల లక్ష్యం నెరవేరుతుందని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. మిత్రుడు వెల్స్ ఫర్గో సంస్థ అధినేత శ్రీధర్ చుండూరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ మూడు రకాల పండ్ల మొక్కలు నాటారు. అనంతరం తన తరపున గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అదనపు ఎస్పీ శ్రీమతి సి.నర్మద, డీటీసీ అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డిలను ఆయన కోరారు. వారు మూడు మొక్కలు నాటడంతో పాటు ఒక్కొక్కరూ మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొక్కలు నాటి సంరక్షించాలని అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. మొక్కలు విస్తృతంగా నాటడం ద్వారా జిల్లాను హరితవనంగా తీర్చిదిద్దాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: Green Challenge, Nalgonda SP, planted, friends, police

Advertisement

Next Story