- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను రీప్లేస్ చేసే గడ్డి
దిశ, ఫీచర్స్ : ‘ప్లాస్టిక్’ పర్యావరణానికి హాని కారకమని కొన్నేళ్లుగా వింటూనే ఉన్నాం. ఈ మేరకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టిసారిస్తున్నా.. ప్లాస్టిక్ నిర్మూలన చర్యలు ఆశాజనకంగా సాగడం లేదు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు కూడా పర్యావరణహిత ప్రొడక్ట్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. తాజాగా డెన్మార్క్‌కు చెందిన పరిశోధకులు ప్యాకేజింగ్ కోసం రూపొందించిన గ్రాస్ ఫైబర్‌లు కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు హానికర ప్లాస్టిక్‌ను రీప్లేస్ చేయడంలో సాయపడనున్నాయి.
డెన్మార్క్‌లో ‘టేక్ అవే’ ఫుడ్ ప్యాకేజింగ్(Food Packaging) కోసం సగటున 10,000 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుండగా.. ప్లాస్టిక్‌ను తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయ ప్రొడక్ట్స్ తయారుచేసేందుకు డెన్మార్క్ పరిశోధకులు ‘సిన్‌ప్రోప్యాక్’(Sinpropack) అనే ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రస్తుతం ప్యాకేజింగ్ కోసం ఉపయోగిస్తున్న డిస్పోజబుల్ ప్లాస్టిక్‌కు స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో.. ఆర్హస్ విశ్వవిద్యాలయ, డానిష్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ఈ ప్రాజెక్ట్ కోసం సంయుక్తంగా పనిచేస్తున్నారు.
‘మేము గడ్డిని కోసిన తర్వాత, అందులో నుంచి పశుగ్రాసం నిమిత్తం ప్రోటీన్‌ను తీసేస్తాం. సెల్యులోజ్ కోసం గ్రాస్ ఫైబర్‌లను శుద్ధి చేసి, గుజ్జు చేస్తాం. దాని నుంచి ప్యాకేజింగ్‌ను ఉత్పత్తి చేయవచ్చు. బయోఫైనింగ్ కోసం యాడెడ్ వ్యాల్యూ సృష్టించడానికి ఇది ఉత్తమ మార్గం. ఎందుకంటే గ్రాస్ ఫైబర్లు అన్నింటిని పశువుల మేతగా ఉపయోగించలేరు. ఇక పీట్ నేలలో పండిస్తు్న్న బయోమాస్‌ను ఉపయోగించే అవకాశాలను కూడా ఈ ప్రాజెక్ట్ నిశితంగా పరిశీలిస్తోంది. ఇది సాధారణంగా ఎక్కువ పీచు, తక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది’ అని ఆర్హస్ విశ్వవిద్యాలయంలోని జీవ, రసాయన ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మోర్టెన్ అంబి-జెన్సన్ చెప్పారు.
‘గడ్డితో తయారు చేసిన బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ వల్ల పర్యావరణ ప్రయోజనాలు అనేకమున్నాయి. ప్యాకేజింగ్ 100% బయోడిగ్రేడబుల్ కాగా, ఈ ప్యాకేజింగ్ కంటైనర్స్‌ను మట్టిలో పడేసినా, సహజంగా కుళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం డెన్మార్క్.. టేక్-అవే ఫుడ్, డ్రింక్స్ కోసం 10,000 టన్నులకు పైగా ప్యాకేజింగ్‌ను వినియోగిస్తోంది. దీన్ని బయో-బేస్డ్, బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌తో భర్తీ చేస్తే ఏటా ప్యాకేజింగ్ ఉత్పత్తుల నుంచి సుమారు 210,000 టన్నుల CO2ను తగ్గించొచ్చు. ఆహార ఉత్పత్తులకు సంబంధించి సింగిల్ యూజ్ ప్యాకేజింగ్ కోసం గ్రీన్ బయోమాస్‌ను ఉపయోగించుకునే అవకాశాలకు, దీని ద్వారా ప్యాకేజింగ్ పరిష్కారాల్లో ఒక నమూనా మార్పుకు ఈ ప్రాజెక్ట్ ఆధారం కానుంది -అన్నే క్రిస్టిన్ స్టీన్క్‌జార్, డానిష్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ డైరెక్టర్