- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొద్దిసేపు ఓపిక పట్టు తాత.. నీకేం కాదు
దిశ, వెబ్ డెస్క్ : కరోనా వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మానవత్వం అనేదే మర్చిపోయి కన్నవారిని కూడా పట్టించుకోని ఎన్నో ఘటనలు చూస్తున్నాం. నవమాసాలు మోసి, కని పెంచిన కొడుకు, కూతురు పట్టించుకోక పోయినా.. కరోనా సమయంలో ఓ వృద్ధుడికి తన మనుమడే అన్నిఅయి అక్కున చేర్చుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన ఎస్. గోపాలరావుకు వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కరోనాతో బాధపడుతున్న ఆయనని కన్నబిడ్డలు పట్టించుకోకపోయినా.. చిన్నప్పటి నుంచి గుండెలపై ఎత్తుకుని పెంచిన మనమడు పడిన ఆరాటం చూస్తే ఎవరైనా చలించక తప్పదు. వారం రోజులుగా కరోనాతో బాధపడుతున్న తన తాతను సోమవారం విజయవాడలోని కొవిడ్ ఆసుపత్రికి తీసుకొచ్చాడు మనుమడు. ఒంట్లో ఓపిక లేక ఆయాసంతో లేవలేని స్థితిలో ఉన్న తన తాతని ఆసుపత్రి ఆవరణంలో ఓ చోట పడుకోబెట్టి పరుగున వెళ్లి ఓపి రాయించాడు. నాలుగు గంటలపాటు ఆయాసంతో లేవలేని స్థితిలో ఉన్న తాతను చూసి బోరున విలపిస్తూ ముఖం మీద నీళ్లు చల్లుతూ తాతా.. నీకేం కాదు. నేనున్నాను అని ధైర్యం చెప్పాడు.
కొద్దిసేపు ఓపికపట్టు తాతా.. నువ్వు చచ్చిపోతే నేనూ చచ్చిపోతా తాతా.. నా గురించైనా నువ్వు బతకాలి తాతా అంటూ ఏడుస్తుంటే అక్కడున్న వారికి కళ్లవెంట నీళ్లు తిరిగాయి. కొద్దిసేపటికి స్ట్రెచర్ తీసుకొచ్చి కొద్ది దూరం నడువు తాతా.. అంటూ స్ట్రెచర్‌పై పడుకోబెట్టి తానే తోసుకుంటూ ఆసుపత్రిలోకి తీసుకెళ్లాడు. ఈ హృదయవిదారక ఘటన చూసిన వారందరి కళ్లలో నీళ్లు తిరిగాయి.