- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్రోల్ ట్యాక్స్ లతో లక్షకోట్లు వసూళ్లు..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం విధింపు ద్వారా ప్రభుత్వం వసూళ్లు ఏకంగా 48 శాతం పెరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఎక్సైజ్ సుంకం వసూళ్లు రూ. 67,895 కోట్లు జరగ్గా, ఈ ఏడాదిలో ఏప్రిల్-జూలై మధ్య కాలంలో ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం వసూళ్లు పెరిగినట్టు గణాంకాలు పేర్కొన్నాయి.
కొవిడ్ మహమ్మారి నుంచి ఆర్థికవ్యవస్థ కోలుకుంటూ ఉండటంతో అమ్మకాలు పెరిగాయని, అలాగే గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్సైజ్ సుంకం వసూళ్లు కూడా ఎక్కువగా నమోదవడం వల్లనే లక్ష కోట్లకు పైగా ఆదాయం లభించినట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ఈ ఏడాది మార్చి నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు 88 శాతం పెరిగి రూ. 3.35 లక్షల కోట్లకు చేరుకున్నాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1.78 లక్షల కోట్లుగా ఉందని పెట్రోలియం, సహజవాయువు సహాయమంత్రి చెప్పారు. కొవిడ్ రాకమునుపు 2018-19లో ఎక్సైజ్ సుంకం ద్వారా వసూళ్లు రూ. 2.13 లక్షల కోట్లుగా ఉన్నాయి.