పోచం‘పాడు’ రెవెన్యూ అధికారిపై ఆరా..!

by Aamani |
పోచం‘పాడు’ రెవెన్యూ అధికారిపై ఆరా..!
X

దిశ, ఆదిలాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు భూముల్లో ఓ సీనియర్ రెవెన్యూ అధికారి అక్రమాల వ్యవహారంపై ప్రభుత్వం విచారణ మొదలు పెట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ అధికారిపై ఎప్పుడో పరిహారం చెల్లించిన భూములకు సాదాబైనామాలతో పట్టాలు సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముంపు పరిహారం చెల్లించిన భూములకే సుమారు 50 ఎకరాలకు పైగా పట్టాలు సృష్టించటం, ఈ భూములను ఆనుకుని అక్రమంగా 100కు పైగా ఎకరాల్లో చేపల చెరువులను నిర్మించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈ అక్రమాలపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ప్రాజెక్టు ఉన్నతాధికారులను నీటిపారుదలశాఖ ప్రభుత్వ సలహాదారు శ్రీధర్ దేశ్‌పాండే ఆదేశించారు. అలాగే, నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ, రెవెన్యూ శాఖను విచారణ కోరగా, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీవో రాజు, తహసిల్దార్ శివ ప్రసాద్, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామారావు, ఇతర అధికారులు ఎస్సారెస్పీ ముంపు భూములను సోమవారం సందర్శించారు. మరిన్ని ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రామారావు తెలిపారు.

Tags : sri ram sagar, SRSP, pochampadu, corruption, revenue, nirmal, collector, sridhar desh pande, project officials

Advertisement

Next Story

Most Viewed